పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము

సీత యొక్క వివాహ ప్రయత్నము- బైరాగి యొక్క ప్రసిద్ది- అతడు వైద్యమునకు గుదురుట - జనార్దన స్వామి యుత్సవము- రుక్మిణి యొక్క కాసులు పేరు పోవుట .


ఒకనాటి యుదయమున రాజశేఖరుడుగారు సభ తీర్చి చావడిలో గూర్చుండి యుండగా సిద్దాంతి వచ్చి తాటాకులతో అల్లిన యొరలోనుండి సులోచనముల జోడును దీసి ముక్కునకు దగిలించుకొని దాని దారమును నొసటనుండి జుట్టుమీదుగా వెనుకకు వేసుకునికూరుచుండి తాటాకుపుస్తకమునకు గాట్టిన దారములో గ్రుచ్చిన చిన్నతాటాకు ముక్కలను నాలు గయిదింటిని పయికిదీసి ముందుకు వెనుకకు త్రిప్పుచు వానివంక జూడసాగెను.


రాజ - సిద్దాంతి గారూ ! సీత కేసంబంధము బాగున్నది ?


సిద్దాం - చక్కగా నాలోచించి చూడాగా మంత్రిప్రగడ బాపి రాజు గారి కుమారునుజాతకము స్ర్వ విధముల నౌకూలముగా గనబడుచున్నది.


మంత్రిప్రగడ బాపిరాజు తన కొమారున కేలాగున నైన సీతను జేసికొన రాజశేఖరుడుగారితోడి బాంధవ్యమువలన బాగుపడవలెనని చిరకాలమునుండి కోరియున్న వాడు కాన , ఈనడుమ దన యింట జరిగిన సీతాకళ్యాణ సమయమున సిద్దాంతికి మంచి దోవతుల చాపు కట్టబెట్టుటయే కాక సీత నిప్పించిన యెడల నింతకంటె మంచి బహుమానము చేసెదనని యాశపెట్టెను.


రాజ - బాపిరాజు కుమారుడు నల్లని వాడు. చదువులోను తెలివిలేదని వినుచున్నాను. వా డప్పుడే దుస్సహవాసముచేత చెడు