పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వి తీయాశ్వాసము

సీ. తమ్ములుఁ గృష్ణుండు ఁదక్కటిదొరలును
దెగి వెంటరాఁగ యుధిష్ఠిరుండు
మడువుకడకు వచ్చి మఱిమఱి యెమ్ములు
చిల్లలువోవంగ ఁబెల్లుగాను
రోఁతమాటలు వల్క రోసంబు మదిఁబుట్టి
దుర్యోధనుఁడు తాను దోడులేక
యెుంటరియై యుంటయును వారు పలువుర
తోడ్పాటుననుబల్మితొడరియుంట
చెప్పియెుక్కఁడొక్క ఁ డెతన్ను ఁ జేరిపోర
నందఱనురూపుమా పెదనంచుఁబలుకఁ
దగిన తేరునువాలును మెుగి నొసంగి
యెుక్కనినెపోరుసలుపంగనిక్కు వముగ.

క. పనిచెద ననుచు యుధిష్ఠిరుఁ
డనఁగా నమ్మాటబలిమి నందఱ చూడం
గను మడువు వెడలివచ్చెను
దనుచేతను గుదియ యెుప్ప ఁ దగ రారాజున్.

క. అప్పుడు వెన్నుఁ డు భీముని
నొప్పుగఁ బురికొల్పెఁ బోరి కొగి బలరాముం
డప్పుడవచ్చి పెనం గెడి
చొప్పును నిర్వురచలంబుఁ జూడఁగ నిలిచెన్.

తే. అప్పుడెల్లరు మడువును నల్లవిడిచి
పొలికలని కేగుదెంచిరి పొలువుమిఅఱు
గుదియలను గేల నంకించి యుదుటుపొదల
గాడ్పుపట్టియు రారాజు గదిసిరంత.