పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము
ఆ. తొడరి జమునికొడుకు దుర్యోధనుఁడుఁ దాఁకి
పెద్దతడవుకడిమిఁ బెనఁగనందుఁ
దేరుగోలుపోయి రారాజుమైనొవ్వ
నొల్లఁబోయెఁ జెలులయుల్ల మెరియ.

ఉ. కవ్వడి కర్ణునిం దొడరి గాటముగా బడలించి తూపులన్
దవ్వుగఁ జోపె నాతనినిఁ దక్కినజోదులు నడ్డుసొచ్చుడుం
గరొవ్వడఁగించె వారి నెలగోలున నంతటఁ బ్రొద్దుగ్రుంకుటన్
జివ్వను మాని మానుగడను జేరిరి యిర్వురు వీడుపట్టులన్.

క. మఱునాఁటిపోర శల్యుని
మఱిమఱిబతిమాలి కడకు మైకొన నతనిన్
గఱువయగు కర్ణునరదము
నెఱిఁ దోలగఁ బంచె ఱేఁడు నేరువుతోడన్.

సీ. నొగలెక్కి శల్యుండు తగఁ గర్ణుఁ బేర్కొని
మది కలంగఁగ బీదమాటలాడి
కాకిమీదనిబెట్టి కాఱు లాతనిఁ బల్కి