పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
నాల్గవ ప్రకరణము


అ మాటలు విని యాప్రబోధికను దొడ్దిలోనికి బిలుచుకొని పోయి కొట్లచాటున గూరుచుండబెట్టి తాను లోపలికిబోయి చేటాలో బియ్యము పోసి తెచ్చి యాబియ్యమును దనచేతిలో నుంచుకొని ముమ్మాఱు తనచేయి ఫాలమున మోపి మ్రొక్కి కార్యమును తలచుకొని రుక్మిణి తన చేతిలోని బియ్యమును చేటలో విడిచిపెట్టెను. అప్పుడాయెఱుకత తాను వల్లించినరీతిగా నిష్టదైవతముల దలచుకొని నాకీయుడని వేడుకొని యామచేయి పట్టుకొని "భాగ్యము కల చెయ్యి, ఘ్రొష్ట గల చెయ్యి" యనిపలికి, నీ నొక్క తలపుతలంచినావు; ఒక్కకోరిక కోరినావు; ఒక్క మేలడిగినావు; అది కాయో పండో కల్లో నిజమో చేకూఱునో చేకూఱదో యని తొృక్కట పడుచున్నావు; అది కాయ కాదు పండు ; కల్ల కాదు నిజము. శీఘ్రముగానే చేకూరనున్నది. ఆడువారివంక తలంపా మగవారివంక తలపాయందు వేమో మగవారంటే గడ్డము ఆడువారు అంటే లక్కాకు" అని రుక్మిణి ముఖలక్షణములను చక్కగా కనిపెట్టి 'మగ వారివంక తలం' పన్నప్పుడామె మొగ మొకవిధముగా నుండుట చూచి సంగతి నూహించి "నీది మగవారివంక తలంపు ; శీఘ్రము గానే కార్యము గట్టెక్కనున్నది; నీరొట్టెనేతబడనున్న" దని చెప్పి తక్కిన ప్రసంగమువలన రుక్మిణి మనసులోని సమ గతి నంతను దెలిసికొని, రుక్మిణిమగడు దేశాంతరగతు డయినవాతనా వఱకే విని యున్నదికాన "నీమగడు చెడుసావాసము చేత దేశాలపాలయి తిరుగుచున్నాడు; నీమీది మోహముచేత నెల దినములలొ నిన్ను వెదకుకొనుచు రాగలడు" అని చెప్పి సంచిలోని వేరునొకదానిని తీసి పసపుదారముతో చేతికి కట్టి ప్రాత బట్టయు రవికయు బుచ్చుకొని, మగనితొ గలిసి కాపురము చెయుచున్న తరువాత క్రొత్తచీర