పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఉ. అందఱ కన్నిరూపులయియాతఁడు పోరగఁజుట్టుముట్టియా
సందునఁగాలిమూఁకలును జాలఁగ బోరొనరించి రయ్యెడన్
మందెడునేనికల్ సమయుమాపులుఁగూలెడుకాలిబంటులున్
గుందెడిమేలిమానుసులుఁగ్రుంగెడుతేరులు నయ్యెనెయ్యెడ౯.

క. అదియెల్ల గని యుధిష్టిరుఁ,
డెదలోఁదలఁకొలదియప్పుడే సాత్యకినిం
గదలఁగఁబంచెనుగ్రీడికి,
నదనునసాయంబుచేయ నచటికి నెమ్మి౯.

తే. ఇంతలో యుధిష్టిరుఁడోజనేగిద్రోణు,
నొకటమార్కొనిచేడ్పడియోడిపాఱె
నపుడలంబసుఁడాముననడరితాఁకి,
మందెనుఘటోత్కచునిచేతమఱియునచట.

సీ. సాత్యకి ద్రోణునిసరకు సేయక దాఁటి
జలసంధుఁడనువానిఁజక్కడంచి
దారిని సాగిసుద్ర్శను బొలియించి
దుశ్శాసనునితోడఁదొడరె రెండు
తడవ లాతనినొంచితడయక చనుదెంచి
వడిఁగ్రీడియొద్దకు వచ్చి చేరే
నచ్చట ద్రోణుండు మచ్చరంబునక్షత్ర
వర్మలోనుగఁగలవారిఁద్రుంచె

నన్నపంపున భీముండు నరుగురుదెంచి,
ద్రోణుని మెఱుంగుటమ్ములఁ దూలఁబుచ్చి
యడ్డపడు వారినెల్లఁగ్రొవ్వరుఁగఁజేసి,
కవ్వడిని జేరఁజనుచుండెఁగడి మిమెఱసి.