పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వీతీయాశ్వాసమ

సీ.బండి మొగ్గరమును బన్నించి మఱునాఁడు

ప్రొద్దున ద్రోణుండు మొగమునందుఁ

దానిల్చి యవ్వల దవ్వల సైంధవు

జోదులనడుమను జుణుఁగఁబెట్టి

యాయితంబయియుండనర్జునుఁడన్నను

గాపాడసాత్యకిఁగావలిగను

బెట్టియొడ్డునుడాసిబిట్టేసితాటిపం

డులుఁబోలెఁదలలెన్నొడొల్లనేసి

దుస్ససేనునొంచిద్రోణునివడిమించి, మొగ్గరంబుసొచ్చిమొనలవ్రచ్చి కినుకయినుమడించికృతవర్మఁదూలించి, చనిశ్రుతాయుధునినిఁజక్కడంచె.

క. ఈనడుమద్రుపదు కొమరుఁడు, ద్రోణునితోఁ బోరిపోరి తొలఁగిన నలుఁగుల్ మేనన్నించుచు సాత్యకి, నోనేసెం ద్రోణునపుడు నూర్వురు మెచ్చ౯.

ఉ. కవ్వడియంతసైంధవునిఁ గానఁ గబోవుచునుండఁద్రోవలో నెవ్వడివడ్డుసొచ్చివడినీల్గిరివిందుఁడువానితమ్ముఁడు౯ జివ్వకుఁగత్తళంబలగఁజేరిసొయోధనుఁడాలిమిచ్చిమై నొవ్వగఁబాఱెఁగ్రీడియునునూల్కొనిసైధవుడాసెనీసునన్.


తే.అపుడుకృపుడునశ్వత్థామయల్లసైంధ వుఁడునుబ్రొద్దుకొడుకునుశల్యుఁడుమొదలగు పన్నిరువురొక్కపెట్టనుబన్నివచ్చి