పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

క. వినువాఁకకొడుకు కూలిన,
     వనరుచు దుర్యోధనుండు వడినెలవునకుం
     జనియామఱుపటినాఁడొగి
     మొనగానిఁగజేసె ద్రోణుమూఁకలకెల్లన్.

క. తన్నటువలె దళవాయిఁగ,
     మన్నననొనరింప నలరి మక్కువద్రోణుం
     డెన్న యుధిష్ఠిరు ననిలో
    నన్నీకొసఁగెదను బట్టినలువురుఁజూడన్.

క. అని బాసయిచ్చె దుర్యో
     ధనునకు నాతండు మదినిఁదద్దయు నబ్బన్
     విని యర్జునుఁడన్నకుఁ జె
     ప్పెను దిటవును దాననతఁడు వెరువకయుండె౯.
                                                       తోటకము.
     మొనలెల్లను వీఁగఁగ ముల్కులు పె,
     ల్చనగ్రుచ్చుచు ద్రోణుఁడు సాత్యకిను
     క్కునమార్కొని తూవులు గోరముగా,
     ననినేసెను ద్రోవది యన్నపయి౯.

తే. శల్యుఁడునుభీముఁడునుదాకిసరకుసేయ
     కొండొరులనొంచిమించుచునొకరికొకరు
     నెత్రువఱదలు వాఱంగనెట్టికొంచుఁ,
     బూచుమోదుగులట్టులు పొలిచిరపుడు.

సీ. కర్ణునికొమరుండు గండునవృషసేనుఁ
                                      డడరి మూఁకలనెల్లఁ బొడవడంపఁ
     దొడఁగిననకులుని కొడుకు శతానీకుఁ
                                     డెడసొచ్చి బలుగూపు లొడలనించె