పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>

                                                     శుద్దాంధ్రభారతసంగ్రహము 
నందెదామగ్రంధి యనఁగను నకులుండు

గుఱ్ఱాల బరికింప గొలువుకుదిరె

నాలగాన దంత్రీపాలుడ నెడుపేర
నక్కడనె సహదేవుడు నమరియుండె
మాలిని యనంగ ద్రోవదిపూలుముడువ
నొడయని వెలందుక సుధేష్న యొద్దనుండె.

అ.జెట్టిపట్టి సింగంబుతో నైనఁ

బులులతోడనైనఁబోరిగెలిచి
దొరకు నతనియనుఁగుఁ దొయ్యలులకు వేడ్క
సలువుచుండు నొకఁడు వలలుఁడెపిడు.

సీ.అట్లు కొన్నాళ్లేగ నప్పసుధేష్ణను

          గన సింహబలుఁడట కొనరవచ్చి
మాలినిఁదిలికించి మదినామె సొగసెంచి
        మాటికెదఁదలంచి మరులుమించి
యక్కకునెఱిఁగించి యిక్కకుఁజనుదెంచి
         పాంపున మేనుంచి వనరుచుండ
మాలిచేఁదమ్మునునికికిఁగల్లును
         రాణిగారంపిన రమణఁగొనుచుఁ

గృష్ణయేగిననాతఁడు కెరలిపడుచుఁ

దన్నుఁ బట్టంగ వచ్చినఁ దలిరుఁబోఁడి
కొలువుకూటంబు దెసఁబాఱఁగూడవచ్చి
సింహబలుఁ డింతికొప్పను జేతఁబట్టి.

క.ఈడిచి యొకరక్కసుచే

నీడిగిలం ద్రోయఁబడుచు నింటికిఁ జనియెం
<poem>