Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

     భీము@ండరుదెంచి సైంధవు వేగముట్టి
     గడియలోఁబట్టి తలపట్టి గాడ్పుపట్టి.

క. అన్నకడకీడ్చి తెచ్చినఁ,
     జెన్నఱితల రేవులుగను జెడగొఱుగంగా
     విన్ననయి యున్న సైంధవుఁ
     గ్రన్నన విడిపించిపుచిపుచ్చెఁగాంచి యతండున్.

తే. అవల నొకనాఁడు తమ్ములుఁగవలునేగి
     విసపునీటినివదన్నవినక త్రావి
     పడిననల్వురగుదెదారిపలుకులకును
     నొప్పమార్వల్కిబ్రతికించి మెప్పులొందె.

వ. అట్లెండలం బడలియు వానలం దడిసియు వెడిదంబులగు నిడుమలు
తొడరియు జడియక యడవిలోనుండఁ బండ్రెండేండ్లు నండిన నాదండి
మగలు తమతోడఁ గూడనున్నవారి నందఱ నాయాయెడలకుంబంచి
మించిన వేడుక నించుకయుఁ దమజాడలెవ్వరు నెఱుంగకుండ దండి
తనంబునఁ గాఱడవులంబడి నడచి కడకొక్కయెడ నేకతంబు
నందగిన వేసంబులు వేసికొని బయకలుదేఱి విరటునూరుచేరి
యాచేరువం దమకత్తుల మొత్తమ్ములను బీనుంగుతో లొకటిఁజుట్టఁబెట్టియప్పట్టుననున్న జమ్మిచెట్టుపయింబెట్టి.

సీ. కంకుఁడు నాఁగను గతలు సెప్పంగ యు
ధిష్ఠిరుఁడాఱేని దెననునిలిచె
వలలుండనంగను వంటలవాఁడయి
వడముడియుచ్చోటఁ బనికినమరె
నచట బృహన్నలయనుపేరఁ గవ్వడి
నెలఁతల కాటలు నేర్వఁజేరె