పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్దాంధ్రభారతసంగ్రహము

     బెనఁకువను రోఁకటను దొడల్ విఱుగఁగొట్టి
     యెడమకాలను దలఁదన్ని యెలమిఁ గాంతు
     ననుచుఁ బెనబాసచేసిన నంతయు విని
     ద్రోవదినిబిల్చి ధృతరాఝ్టృఁడీవి నెఱపి.

క. దొరతనమెల్లము మరలం,
     గరమక్కటికముననిచ్చి కలుపుకొని యుధి
     ష్ఠిరు నంచినఁ దనవీటికి,
    నరగెందమ్ములను నాలి నాతఁడు గొన్నుచు౯.

క. అదిగని దుర్యోధనుఁడవు,
     డెదలోనంగుది మామ నేకతమునకుం
     గదియించి కొన్నినాళ్ళకు,
     నదనారసిచెప్పి తండ్రి యానతిగొనుచు౯.

ఆ. ప్రాతిగామినంచి పాండుకొమాళ్ళను,
     నటకు మరలవచ్చునట్లుచేసి
     కఱ్ఱిపెద్దయన్నఁ గడుపడిఁ బురికొల్పి,
     నెత్తమాడునట్లు మెత్తపఱిచి.

సీ. జూదాన నోడినచో దొరతనమెల్ల
                               విడిచి పండ్రెండేఁడు లడవినుండి
     యామీఁద నొక్కయేఁడమరంగ నెవరికిఁ
                                గానరాకుండంగఁ గడపవలయు
     నీలోన నెవ్వరి కేనియుఁ గనిపింప
                                మరల నెప్పటియట్ల జరపవలయు
     ననిచెప్పించి యాడినశకుని యు
                                ధిష్ఠిరునోడించె దిట్టయగుచు