పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

సీ. అచ్చోటఁ గొన్నాళ్ళు విచ్చలవిడినుండి
మామను నీడ్కొని నేగుమునను
ద్వారకకు బోయి దగ్గఱ రైవత
కంబనుకొండను గదిసి యచట
నండంగఁ గృష్ణుఁడు నిండువేడుకతోడ
నచ్చటి కరిగి వివ్వచ్చుతోడ
మాటాడి యేగి యామఱనాఁడు తనవీటి
వారిని బండగు వేరుపెట్టి

తోడుకొనివచ్చి యటమున్నె దొంగకావి,
తాల్పు వేసంబు నచ్చోటఁదాల్చియున్న
క్రీడి కందఱ ర్మొక్కించి వేడుకలర
నతని నంటికిఁ గొనిపోయి యవల నునిచి.

క. తనచెలియ లగు సుభద్రను
బనిచెను సన్నాసియెుద్దఁ బనినేయఁగా
నెనరున నర్జునుమది యా,
ననఁబోఁడిం దగులు టెఱిఁగి నగరున నొకచోన్.

తే. కోరికలుజాఱిపొలఁతుల కూర్మితీఱి,
జగములోబోడలగు టెందుసాజమరయఁ
గోరికలుమీఱిపోలఁతులకూర్మిఁగోరి,
యక్కజంబుగఁదాబోడయయ్యెఁగ్రీడి.

సీ. ఉవిదపై దవిలిన యుల్లంబుతోఁగ్రీడి
కనువిందుగాఁ బనుల్ గొనుచునుండ
మంతనంబునఁగృష్ణుఁడంతయు ఁదలిదండ్రు
లకుజెప్పియెుప్పించియెుకటఁబెండ్లి