శుద్ధాంధ్రబారతసంగ్రహము
తే.ప్రొదువాలినఁ గెంజాయ పొదలిపిదపం
గారుచీఁకట్లు మింటను గ్రమ్ముకొనియె
రేవెలందుక దాల్చిన కావికోక
విడిచి నల్లని చీరను దొడిగె ననఁగ.
క.ఆచీఁకటిలో నిళుల
మోచుకొనుచు వచ్చి చెట్టూ మొదటనుగూర్కం
జూచియు వారల లేపక
కాచుకొని యంతడు నిలిచెఁ గడుఁ గడిమియెయి.
సీ.అప్పు డక్కానలొ నెప్పుడనుండు హి
డింబుఁడన్ రక్కసుఁ డిమ్మునుండి
వారలఁ గని పొంగి వడివడిఁ జెలియలిఁ
బనిచె హిడింబను వారిఁ బట్టి
వంటకుఁ దేనాపె వడముడిఁ దిలకించి
వలపున మోమోటపడుచు నిలువ
నేజామునకుఁ జెల్లెలేతేరమికి నల్లి
పయనమై మఱి తానె వచ్చినిగుడ
భీముఁ డాతని దవ్వుగాఁబిఱిఁది కీడ్చి,
దొమ్మికయ్యమ్ములోవానిఁగ్రుమ్మిచంపి
యన్నపనుపఁగఁ దల్లియు నవుననంగఁ,
బెండ్లియాడి హిడింబను బేర్మితోడ.
తే. దానితో ఁగూడి కొన్నాళ్ళు కానలందుఁ
బగలు నలరాచపనులను మిగులఁ బెనఁగఁ
బుట్టెఁదగ ఘటోత్కచుఁ డనుపట్టియొకఁడు
వాఁడితనమును జిత్తులు బలిమిగలిగి.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/624
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది