పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

     ప్రధమాశ్వాసము

క.పనిచి పురొచనుడును జెం,
     తను గొడుకు లయిదుగు రెరుకతయు నిదిరింపం
     గనిలక్కయింటి కగ్గిని,
      గనలునఁ దగిలించిపొయెఁ గడునడు రేయిన్.

క.ఆరాతిరి యాయిల్లుటు,
      గోరముగాఁ గాలిపొవఁ గూరిని వగతో
      నూరన గలవారెల్లను,
      జేరువఁ జనుదెంచి కాంచి చిడి చిడిముడిపడుచున్.

క.గొంతియుఁ గొడుకులుఁదెగిరని,
     యెంతయు వగఁబొది యేగిరిండ్లు కునచ్చో
     నంతయు దృతరాష్టుఁ విని ,
     యింతం తనరాని కస్తి నెదలోఁ బొందెన్.

ఆ.గాడ్పుపట్టి యచటఁ గన్నతల్లిని దోడఁ,
       బుట్టువులన మీఁదఁ బెట్టుకొంచు
       ముండులనక పెద్ద గండులనక యేగెఁ,
       గారుకానలందుఁ గరము దవ్వు.

ఆ.రేయి వారు వడెడి రాయిడిఁ బాపంగ,
      నెంచియడు వెలుఁగుఁబంచెదయ్య
     మనఁగఁ బ్రొద్దుపొడిచె నావల నార్వురు,
    నెండ యెక్క దాఁక నేగి యేగి.

క.కడుబడలి యెండతాఁకున,
     వడగొట్టిన బిట్టుసొలి వారలుపడఁగా
      వదముడి నీళులకొరకుం
      గడుదువ్వుగఁ బోయి మరలి కదిసెడులోనన్.