- రాజశేఖర చరిత్రము
ఆయన కెల్లవారును మిత్రులుగా నుండిరి - ఆ మిత్రసహస్రములలో నొకడైనను నిజమైనయాప్తు డున్నాడో లేడో యన్ననగతిని మాత్రమాయనకు ధనలక్ష్మీ తెలియనిచ్చినదికాదు. అట్టి మిత్రోత్తము లందరును రాజశేఖరుడుగారికి స్తుతిపాఠములతో భూమి మీదనే స్వర్గసుఖమును గలిగించి యాయన నానందింప జేయుచుదా మాయన యిచ్చెడి ధనకనవస్తు వాహనముల నాతని ప్రీతికై యంగీకరించుచుందురు. నిత్యమును యాచకు లసంఖ్యముగానిచ్చి తమ కష్టకధలను గాధలుగా జెప్పి చినఱకు దమ కేమయినను ఇమ్మని తేల్చుచుందురు- అట్టివారు నటించెడి యాపదల నన్నిటిని అతడు నిజమయినవానిని గానే భావించి సాహాయ్యము చేయుచుండును. కొందఱు బ్రాహ్మణులు పిల్లవానికి వివాహము చేసికొనెద మనియు, ఉపనమునము చెసికొనెద మనియు, తాము యజ్ఞములు చేసెదమనియు, సత్రములు సమారాధనలు చెయించెద మనియు, చెప్పి యాయన వద్ద ధనమార్జించుకొని పోచుందురు. మిత్రుల వేడుకకయి రాజశేఖర్ గారియింట రాత్రులు తరుచుగా గానవినోదములును నాట్య విశేషములును జారిపోతాది నాటకగోష్టులును జరుగుచుండును. మోసగాండ్రు కొందరు తమకమ్ముడుపోని యుంగరములు మొదలగు వస్తువులను దెచ్చి , వానిలో జెక్కినరాళ్లు వెలయెఱిగి కొనగలిగి సరసులు రాజసేఖరుడుగారు తప్ప మఱియొకరు లేరని ముఖప్రీతిగా మాటలు చెప్పి వస్తువులంత వెల చేయక పోయినను మాటలనే యక్కువవెలకు విక్రయించి పోవుచుందురు. గ్రామములోని వైదిక బృందముయొక్క ప్రేరణచేత సప్తసంతానములలో నొకటైన దేవాలయ నిర్మాణము జీయ నిశ్చయించుకొని, రాజవరపు కొండనుండి నల్ల రాళ్ళు తెప్పించి రాజశేఖరుడుగారు రామపాద క్షేత్రమునకు సమీపమున నాంజనేయునకు గుడికట్టింప నారంభించి నాలుగు