పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్ర భారతసంగ్రహము
నను బూనక కొడుకులక
న్నను బ్రేముడి మీఱబెంచి నలి నేవురనున్.

సీ. దుర్వోధనుండును దోడివారును దమ్ముఁ

గుఱ్ఱలు బాండుని కొడుకు గమియు
నల్లారుముద్దుగా నాటపాటల బ్రొద్దు
పుచ్చెడు తఱిగాడ్పు ముద్దుపట్టి
బలిమి నందఱమించి వలుదెఱంగుల నొంచి
పలువుర నొక్కట బట్టికొట్టు
జెట్లనెక్కినవారి జెట్లూచి వడవైచు
నిలిచి పోల్చినవారినీటముంచు
నిట్లునడుముడి కడగండ్ల నెవుడుగుడువ
నీరసంబెత్తి తాళగా నేరకపుడు
తనదు మామను శకునిని దగవునడిగి
తొడరిదుర్వోధనుడు చేసెదుండగములు.

సీ. నిడు తీవయల గట్టి నిదురించు తఱినేటఁ

బడద్రోయ మేల్కని వెడలివచ్చె
విసముతోడనుజేర్చి వెసగూడు వెట్టింప
నారగింపదడవ యరిగిపోయెఁ
బండుకొన్నప్పుడు పాముల గఱపింప ఁ
గీడొకింతయు లేక కెడపెవాని
దుర్వోధనుడు సేయు దొసగులు మఱియును
వడముడి జెందకవంమ్ములయ్యె
నంత మనుమల జదివింప నద నటంచు
నెఱిగి భీష్ముడు కృపునొద్ద నెల్లచదువు