Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము
నావగిది నర్జునుండను
పాపనిగని మించెగొంతి బలియని మిగులన్.

క. పెనిమిటి సెలవొసగంగా

దననవతియు నేర్పిననుప దమద్రియునుం
గనె వేలుపు వెజ్జుల కొ
య్యననకులుండు సహదేవుడనియెడి కవలన్.

ఆ. ఇట్లు నెతలందు నేవురు కుడుకుల

బడసి సంతసమున బ్రబలియుండి
యేకతంబ మాద్రియెక్కుడు సోయగం
బొక్కనాడు చూచి యోర్వరాక.

క. వెలుపణ దాయల నెందఱ

గెలిచియు దనలోని దాయ గెలువగలేకా
బలియుడు పాండుడు మడిసెను
వలపున నిల్లాలితోడ పడి గలయుటచేన్.

తే. అంతమాద్రియు మగనితో నగ్గిసొచ్చె

గొంతిపాఱులు వెంటరాగొండివిడిచి
సొడుకులను వెంటగొని బావకడకువచ్చె
నెల్లవారికి దముజూచి యుల్లమవియ.

ఉ. కుంతియు బిడ్డలం గొనుచు గూరిమి పెన్మిటి బాసివచ్చుచో

వింతగ జూడవచ్చి రలవీటను గల్గినవారలెల్లదా
మెంతయు వంతతో బనివి యేడ్చుచు నాధృతరాష్టుడాలునుం
గుంతిని వెంటబెట్టుకొని కుఱ్ఱలదోడ్కొని పోయి రింటికిన్.

ప. అంత ధృతరాష్ట్రుండు.

క. తనబిడ్డలను గుఱి తనత

మ్మునిబిడ్దలు నంచు వే`రుపూనిక మదిలో