ప్రధమాశ్వాసము
సీ.అదిమున దనతండ్రి యానతి దుర్వాసు
డనుతపసికి నోరె మమరబెట్టి
మెప్పించి యతనిచే నెప్పుడు తలదిన
నప్పుడవేలువు లరుగుదెంచి
బిడ్డలనచ్చెడు పెనుమెప్పుగైకొని
యెకనాడు సంద్రంపు టోడ్డునందు
దమ్ములివిందును దలచియాతనివల్ల
బుట్టుజోడును జెవిసోగిలున్న
కొడుకుగని వాని బెట్టెతో గడలినిడియె
గొట్టుకొనిపోయి యాబొట్టె గట్టుజేర
గాపొకడు వాని గొనిపోయి కర్ణుడంచు
రహిని బేరుంచి తనచావ రాధకిచ్చె
తే.మాద్రియనుదానినావెన్కమరియుబాండు
డాలుగాగొనియిద్దరవలరజేసి
దెసల నెల్లను దనవాడి యెన గగెల్చి
యన్న చేనెన్నొ చేయించెజన్నములను
సీ.అటులుండి యొక్కనాడాండ్రామదనతోడ
గొనివేటమిమీరగొంతదవ్వు
కానిలోపలనేగి కానగ మెకముల
గూడిపొందెడునట్టి లేడి నిర్రి
నొలకోల నేల పై నొరగింప మగజింక
జడదారిరూపును సరగ దాల్చి
యీవు నీయాలితో నెప్పుడుకల సెదో
యప్పుడ మావలె నయ్యెదంచు