పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/613

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్శాసము

ఆ.కాశిరేడు తనతు కన్ని యలకుబెండ్లి,

  సేయనెంచి యుంటచెప్పవరికి
  ముకురుకన్ని యలను ముంగలనరదంబు
  పయిని బెట్టుకొంచుబయికిబోవ

క.ఎకిమీలెల్లను దాకుడు

  నొకడు న్మగటిమి నెదిర్చి యుక్కరివారల్
  గకవిక గాగనమ్ముల
 సెక లన్మలమలములను మాడ్చి చెదరగజేసెన్ 

వ.మరియును

ఆ.చుట్టుముట్టినట్టి దిట్టలనందర

   నిలిచిపాదోలి గలుపుగాంచి
   త్రోవలోన సాళ్వు దూలించి మరలించి
  వెలదుకలననుగొంచు భీష్ముడరిగ 

తే.అతిగి యంబ యంబాలిక యంబకమును

  ననెడుమూవురలో బెద్దదైనయంబ
  తనదు డెందంబుపాళ్వునిదవలియుంట
  దెలుపనాయింతినటకంపి తిరివువట్టి

క.తక్కిన యిరువుర దమ్మున

  కొక్కట బెండిలియెసర్ప నిప్పుగ నతడా
  చక్కెరబొమ్మల తోడనె 
  మక్కువతో నెవుడు నుండి మండిదెంగన్

సీ.సంతు లేకుండంగ జచ్చిన కొడుకును

                  గని సత్యవతి భీష్ముగదియబిలిచి
 యిల్లాలిగైకొని యిల్లునిల్వగబెట్టి
                 నేలయేలుమటంచు జాలువరకు