పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/612

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

</poem>శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ.తానువడుగుందున మూనంగ వటనెల్ల
వారును విరుచుండం బ్రతినవట్టి
జొలరిదొరతోడ జాల నమ్మికపుట్ట
బలుదెరంగులజెప్పి పదిలపరిచి
సత్యవతినిదెచ్చి సరగువ దండ్రికి
బెండిలిగావించి పెంపుమెరసి
తనచేతిబలిమిని ననిలోనరేడుల
నందరనోడించి యదిమి వారి
వలన గప్పముల్గొని తండ్రినలర జేయ,
సత్యవతితోడికూటమిశంతనుండు
చెలగి చిత్రాందుగండు విచిత్రవీర్యు
డనగనలరారుకొ మరులగయెనంత

ఆ.వారుజవ్వనమును బడయకముందర
     శంతనుండు మేను జారవిడిచె
     దండ్రిచావ బెద్దమ్ముని భీష్శుండు
     పుడమి కొడయడుగను బూనిచేసె

మగంధి.పొంది యేరి బూరికైన బోల్పకుక్క మిర జి
త్రాంగదుండు పోరి కెల్ల దండి వారి జీర జి
త్రాంగదుండు వేల్పుదిట్ట తాకి కయ్యమిచ్మి యా
పొంగడంచి మించి త్రుంచిపోయె నేయు నేటికిన్

తే.అన్న పోయినపొమ్మట నతనితమ్ము
నవిచిత్రవీర్యుని భీష్ముడవుడటచ్చి
దొరదనంబిచ్చి వెలయించిపతున మెదవి
వెలయునతనికి బెండ్లి గావింపనెంచి.