పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్ర భారతసంగ్రహము.

   (అచ్చతెనుగు భారతము)

ప్రథమాశ్వాసము

చ.సిరులను గూర్మితో నొనగి నేగి యెకించుకయైనజేరి నీ

    కరయుచు మంచివారి ననయంబును బ్రోచు జెడ్డవాతలన్ 
    సెరగులపాలు సేయుచును సేమము మిర జగమ్ము  లేలుచుం
    దిరముగ నుండినట్టి యలదేవర గొల్చెద నెల్ల యప్పుడున్

వ.ఇట్లు జగమ్ములనెల్లం డల్లియు దండ్రియు నేలిక యునయి యెల్ల యెడల నిండియుండు నాదండివేలువు నుల్లంబున వెల్లి విరియు నింతం తనరాని సంతపంబున మంతమనంబున నెంతయుం గొనయుం వేడికొని యీమేటిదేవరకు నాపయుంగల వెలలేని కూరిమి పేరిమిని నేనొన రింపబూనిన యీక్రొర్రపొ త్తబుంనకు మెదలెట్టిదనిన.

తే.మున్ను నైములశ మనుకన నున్న యట్టి తపన లొకనాడు నూతుని తరిని జేర భరతుకొలమున గల రాచవారి కతల జెప్పమని వేడినతడట్లు చెప్ప దొడడె

సీ.సొగసుగోటలమిది మగరాలసింగముల్ చౌదంతి నిచ్చలు జంకువరుప మేటియగడ్తలు వీటిబోటులకు జిలువచెల్వలతోడి చెలిమి నొసగ బసిడిమేడలమిద నెసగుక్రాల్గంటుల చెలువ మచ్చరబోంట్ల జిన్నపుచ్చ బూవుదోటలలోని తావుల తేనియల్ చరుగాలువల వెంట జేలదడవ