- నాల్గవ ప్రకరణము
ముననే యాకాశముమీద దివ్యవిమాన మెక్కి వెళ్ళుచునారనియు చెప్పి ఆకాశమువంక జూచి కన్నులు మూసుకొని మూడునమస్కారములు చేసెను. ఈ ప్రకారముగా సంజవేళకు ఆదిపర్వము ముగిసి నందున వాటికి బురాణకాలక్షేపమును జాలించి " స్వస్తిప్రజాభ్యః " మోదలుగాగల శ్లోకమును జదివి యెవరి యిండ్లకు వారు వెళ్లి పోయిరి.
రాజశేఖరుడుగారి యింటికి నిత్యమును బంధువులు నలువది తరములు గడచి పోయినను వంశావృక్షముల సహితము చూచుకోనక్కఱలేకయే తమబంధుత్వము జ్ఞాపకముంచుకొని రాజశేఖరుగారి మీదిప్రేమచేత నాతనినిచూచి యాదరించి పోవలెనను నిద్దేశముతో వచ్చి నెలలకొలదినుండి తినిపోవుచు వస్త్రములు మొదలగువానిని బహుమానములు నడయు చుందురు. ఊరినుండు పెద్దమనుష్యులు అపరిచితులయిన వారును గూడ రజశేఖరుడుగారియింట వంట దివ్యముగాచేయుదు రని శ్లాఘించుదురు; వారు చేయుస్తోత్రపాఠముల కుబ్బి రాజసేఖరుడుగారును వారువచ్చినప్పుడెల్ల పిండివంటలును క్షీరాన్నమును మొదలగువాన్ని చేయించి వారిచేత మెప్పువడయ జూచుచుందురు. అన్న ముడుకక పోయినను, పులుసు కాగకపోయినను, పప్పు వేగకపోయినుకూడ వారివంట బాగుండలేదని యెవ్వరును జెప్పలేదు - ఊరకే వచ్చినపదార్ధమునం చెప్పుడును రుచి యధికముగా నుండునుగదా ? కోందఱు బంధువులు తాము వెళ్ళునప్పుడు కొంత సొమ్మును బదులుపుచ్చుకొని అదివఱకు దఱచుగా వచ్చుచు బోవుచు నుండువారే యైనను అంతటి నుండి తీరికలేక బదులుతీర్చుట కయి మరల నెప్పుడును వచ్చెడివారు కారు. ధనవంతుడు గనుక