పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/606

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజన మనోరంజనము
కందము.ముక్తపదగ్రస్తము.

సిరిఱొమ్మునఁ దాల్చినదొర
దొరలేనిబలిమిఁ బగతురఁదునుము వెరవరీ
వెరవఱినవారిఁ బ్రోచెడు
గరువా, గరువంబులేని కఱదుల వేల్ఫా.

                                  తోటకవృత్తము.

పొలుపొందిన బీరముపూనిజగం
బులనెల్లను నేఁచుచు ముద్దియలా
ర్వలలిం జెఱఁబెట్టింన రావణు నౌ
దలలెల్లనుద్రుంచిన దండిదొరా.

                                        గద్యము.

ఇదిశ్రీమదాసస్తంబసూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధమహకావ్య రచనాచాతురీధురంధర పద్యశోబంధుర కందుకూరివంశ పయఃసారావార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్య పుత్ర సుజనవిధేయ వీరేశలింగ నామధేయప్రణీతంబయిన రసిక జనమనోరంజనం బను ప్రబంధరత్నంబు నందుఁ సర్వంబును జతుర్ధాశ్వాసము సంపూర్ణము.