పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చతుర్థాశ్వాసము

గీ.తమ్మిచెలికాడు చీకట్లదఱుమువాడు
కలువగుంపులనూడు రేవెలుగుజోడు
గాములకు నెకిమిడు జక్కవలఱేడు
పొడుపుగొండను జూపట్టె బ్రొద్దుపిదవ.

గీ.అంతకంతకు వింతయొయ్యారమమర
నరమరలు లేని వలవుల ననగిపెనగి
చెల్వుడును జెల్వయును గూర్మి చెన్నుమిఱ
హాయిగా నుండిరచ్చోట సొఱునెలలు.

క.ఈలోపల నాతోయ్యలి
చూలాలయ్యెను మగండు జుట్టములునెదన్
హాళింబొందగదండియు
జాలగొలమునిల్చునందు సంతనపడగ

చ.చనుమొనలు నల్లపడియెను
జనజనవేవిళ్ళు హెచ్చె జవిమంటివయి
గననయ్యె నెలలునిండిన
గనియెనుముద్దుల కొమారు గన్నియయెలమిన్.

గీ.పుడమివేల్పులిడిన మంచిమూర్తమందు
బభ్రువాహనుండనుచును బౌగుమిఱ
బేరువెట్టిరి యాపసిబిడ్డకెలమి
బెరుగుచుండె నతడు తాతయిరవునందె.

క.అనివై శంపాయనుడిటు
జన మేజయునకు గరంబు సంతపమెదలో
నెనయగ జిత్రాంగదకత
వినిపించిన వినియతండు వేడుక బొదలెన్.