పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము

గీ.చెలులు కయిచేసి తరసింప సిగ్గుకతన
బడతినెమ్మోమువంచి తానడువకున్న
బుద్దులనుజెప్పి మఱిమఱి బుజ్జగించి
వూవుబోడులు బలిమిమై బొదిగిపట్టి.

క.ననబోడి నొకటలాగుచు
బెనిమిటికడ జేర్పదివురవింతగనాజ
వ్వని తాబోక పెనంగిన
గనుగొని యొకచెల్వ యనియె గన్నులనగుచు

గీ.ఇచట మాతోడ బెనగిన నెవ్వరిందు
జూచిమెచ్చుదు రాతండచూచిమెచ్చు
బులువుతీఱంగ బడకింటిపొంతజేరి
వెనుకతీయక మగనితో బెనగరాదె.

క.అనుటయు సిగ్గును జెలిపై
గినుకయు జిఱునవ్వునొకట గిరికొన నవుడ
న్ననబోడి నట్టెవైచెను
గనుదోయిం గెంపుదోప గై విరిదండన్.

గీ.చెలిమికత్తెలు ముందుకు సిగ్గొకింత
వెనుకకునుద్రోయ మెల్లన వెలదినడిచి