పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చతుర్థాశ్వాసము

గీ.ఒండొరుల మేనుసోకుటనొక్కసారి
కన్నెకును ఱేనికిని మేను గగురుపొడువ
దాళిగట్టె నాతడు జవరాలి మెడను
నేలవేల్పుల దీవనల్నింగిముట్టు.

గీ.అగ్గినెలకొల్పి మఱి వారలందులోన
నేయివ్రేల్చిరి పిమ్మట నేలఱేడు
పట్టి సన్నెకల్ ద్రొక్కించెబడతిచేత
నంత బేలాలు వ్రేల్చెనయ్యింతిమిన్న.

సీ.ఎలుగెత్తిపాడెడి యింపైనపాటలు
గండుగోయిలపిండు గరువమడప
పలుకునప్పుడుతోచు పల్వరుసలడాలు
నలువలంకులను వెన్నెలలనింప
పళ్లెమందలిదివ్వెబటువైనమగరాల
మెడ పేరులకు గెంపుబెడగుగూర్ప
మేనిబంగరునిగ్గు మేలిమిబంగారు
పళ్ళెరంబునకును బసిమియొనగ
వారిమోముల కెనరామిబట్టి నెలను
దిగదుడువు పెట్టు కై వడి మొగములకును
జెలికి జెలువునకైదువ లలరువేడ్క
గప్పురపుటారతులనిచ్చి రొప్పుమిఱ

గీ.మొదటినాటితంతు ముగిసినపిమ్మట
బాకెవయును నాగవల్లిమఱియు
వేఱ జరగవలయు వేడుకలెల్లను
వరుసజరిగె నెల్లవారు చెలగ.