594 రసికజనోరంజనము
గీ.తొయ్యలి పిసాళి చూపులన్ తూపుగముల
నోంగానాటియుల్ల మిఱ్ఱాఁతలూఁచి
క్రీడిపయిని వ్రేల్మిడి నిండు గెలువుగాంచి
విరులవిల్తూఁడు కోయిని పేర్చియార్చె. 91
చ.సరగునఁగొమ్మనెమ్మొగము చాయలకుంజి ని సేదతేఱి ని
బ్బరమగు ఱేనిచూవుగవ పైకొకచోటికి సాఁగజూచియున్
గురులను చిమ్మచీఁకటిఁదగుల్కొనియాడకె దారితప్పి బల్
మురిపెపు నవ్వువెన్నెల వెలుంగున వచ్చు చునుండుఁగ్రమ్మఱన్. 92
ఉ.వేఱొక చోటికిం గదల వేమఱువెల్వడి యెందుఁబోవఁగా
నేరక క్రమ్మఱన్మొగమునే వడిఁజేరెడు చూపుమొత్త ము
య్యారవుఁజన్నుఁగొండలను నవ్వలఁదవ్వులఁగాంచి వానిఁబొం
గారఁగ నానవాలుగొని గంతిడి పాయకని ల్చి నచ్చటన్. 93
వ.అటుపిమ్మట. 94
చ.మురుగులుజాఱఁజెమ్మటలు ముద్ద మొగంబున ఁగాఱ ముత్యపు
నరులొకయెరఁజేరఁజిఱునవ్వులు మొల్కలుదేర నంటూజో
ళ్ళిరుదెసలందు ఁజెక్కులవపయినడిఁదూఁగుచు డాలువాఱ నా
దోర తలఁబ్రాలువోసి నలతొయ్యలి యౌఁదలమిద దోయిటన్.
ఉ.కౌనసియాడ ముంగురులు గ్రక్కునఁజెక్కూలమిఁదఁగూడఁబెం
వూనిన గుబ్బదోయి పయినోక్కట పేరులు త్రొక్కులాడఁబై
పైని బయింటయూడ నునుబంగరుగాజులు పట్టు వీడ నా
చానయుఁగ్రీడిమిఁదను వెసం దలఁబ్రాలనుబోసె దోయిటన్. 96
క.మదిలో పల ఁగలకూరిమి
నిదె నేఁబయిచేయియగుదు నిదెయేనగుదున్
వదలక కనుఁడనుక్రియ వా
రొదుగక తలం బ్రాలు పోసి రొండొరుల పయిన్. 97