పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజనము

క. తగువారల వెటంంగొని
      ప్రగడలుచని క్రీడిఁగాంచి వరుసగఁ బలుకం
      దగుపలుకులాడి విందుగ
       నగరికి విచ్చేయవేఁడ నగుచునతండున్.

క. గారవమునఁ దమ్ముందొర
      వారటుప్రగ్గడలఁబంచి వాసిగఁ బిలువం
      గారాకుండుట తగదని
      కూరిమి నేనుంగునెక్కి గొబ్బునఁగదలెన్.

గీ. ఆముటేనుఁగుపై నెక్కి యర్జునుండు
      రాచనగరికిఁబోవుచోఁ జూచువారు
      వేయికన్నుల వేలుపు బిడ్డఁజూడ
     వేయికన్నులెవలెనంచు వింతపడిరి.

గీ పొడుపుఁగొండమీఁదఁ బ్రొద్దువెల్లెడునట్లు
    వెలుఁగుచతఁడు వీట వెడలువవుడు
    మొలఁతుక లపరంజి మేడలపయినుండి
    యలరువానగురిసి రతినిమీఁద.

గీ. క్రీడివేంచేయుచున్నట్టి జాడతెలిసి
    వడిగఁ దగువారితో ఁ జిత్రవాహనుండు
    గౌరుపై న్ ఎక్కి యొదురేగి గారవమునఁ
    దోడుకొనితెచ్చి విడిదిలో దొరనునిలిపె.

గీ. విడిదిచేరినపిమ్మట వేడ్కమీఱ
     నేకతపుటిల్లుచొచ్చి వారిరువురింత
    మంతనంబున నేమేమొమాటలాడి
    యేగుదెంచిరినవ్వుకొంచివలకపుడు.