పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసిజనమనోరంజనము

     లోని చుట్టఱికంబును జానుమీఱు
     చూపుచెలికారమును గొంతచూడవలదె.

క. కలువలదొర యల్లుఁడవై
      కలువలె తూవులుగఁదాల్చి కరమలరెడు నీ
      కలుకమెయి నక్కటకటా
      యళుకొందిన కలువకంటి నలఁచుటతగునే.

వ. అని మంచిమాటల నెంతవిన్నవించిన నించువిల్కానివలన నించు
      కంతయు నక్కటికంబుగానక కటకటంబడి పడంతియావెడవిల్తునిట్లు
     దూఱందొడంగె.

ఉ. ఒజ్జలకాపురంబు మొకలూడఁగద్రొబ్బిన రేయిద్రిమ్మరిన్
       బజ్జను జేర్చికొంటివఁట ప్రగ్గడగాఁగను గన్నతల్లులన్
       విజ్జునవీడనాడిచెడి వేఁబలుగాకులఁ గూడుపుట్టు గు
       డ్లిజ్జగమందు నీకుదడమేయఁట యింతులదోసమెట్టిదో.

గీ. చేతఁ జెఱుజువిల్లొక్కటి చిక్కఁబట్టి
       కంటఁబడకుండఁ బూఁదూపుగములు నాటె
       దేల నికమీఁదఁ దూపులు నేలఁగలియఁ
       బీల్చినీవిల్లు వేల్మిడిఁ బిప్పియుడుదు.

గీ. తోడఁబుట్టినదనియైనఁ జూడకెపుడు
       నీదు తల్లియిల్సిరిగూల్చి నీదుపగతు
       కడనుదలమానికంబయి గరువపడెడు
       నెలను జెలిఁజేసికొంటచేఁదులువవీవు.

గీ. అని మరు మఱియుదూఱఁగ నతివయొక తె
       కంటఁబడకుండు మరునేలకఱకులాడ
       మింటఁగడుమండు నెల చానమేనుగాఁడ
        ననుచుమరలింపఁ జందురుఁగనుచుఁ బలికె.