పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
నాల్గవ ప్రకరణము


సుబ్ర-కార్తికసోమవారము గనుక,ఈదినము రాత్రిదాకనుండి మఱిభోజనము చేయవలెనుకున్నాను.


రాజ-లోపల బల్లమీద ఆదిపర్వ మున్నది తీసికొని వచ్చి శాస్త్రులుగారిని వెళ్ళి పిలుచుకొని రా.


తండ్రి యాజ్ఞ ప్రకారము సుబ్రహ్శణ్యము లోపలికి వెళ్ళి పుస్తకమును దీసికొనివచ్చి తండ్రిచేతి కిచ్చి,నడవలో నుండి నడచి వీధిగుమ్మము మెట్లు దిగుచు, దూరమునుండి వచ్చుచున్నయొక నల్లని విగ్రహమును జూచి 'వేగిరము రండి 'అని కేక వేసి, తాను మరలి వచ్చి శాస్త్రులుగారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడుముగా పుస్తకమును ముందఱ బెట్టుకొని కూర్చుండెను.ఇంతలో శాస్త్రులును బుజముమిద చినిగిపోయిన ప్రాతశాలువును మడతపెట్టి వేసికొని, బంగారము ఱేకెత్తుటచే నడుమనడుమ లోపలి లక్క కనబడుచున్న కుండలములజోడు చెవులనల్లలవాడుచుండ వచ్చి సభలో గూర్చుండెను. రాజశేఖరుడుగారు సాహిత్యపరులయ్యును, ఆకాలమునందు పెద్ద పుస్తకమును జదివి మఱియొక పండితునిచే అథము చెప్పించుట గొప్ప గౌరవముగా నెంచబడుచుండును గనుక,ఆ శాస్త్రులు వచ్చువరకును పుస్తకమును జదువక గనిపెట్టుకొని యుండిరి.


రాజ----మి రీవేళ నింతయాలస్యముగా వచ్చినారేమండీ?


శాస్త్రి---ఇంతకుమును పొకపర్యాయము వచ్చి చూచిపోయినాను. తమరు లేవలేదని చెప్పినందున, వేఱేయొజ్ పెద్ద మనుష్యునితో గొంచెము మాటాడవలసిన పనియుండగా మీరు లేచుచున్నప్పటికి మరల వత్తమని వెళ్ళినాను. ఆయనతో మాటాడుట కొంచెమాలస్య మయినది. క్షమించవలెను- నాయనా! సుబ్రహ్మణ్యమూ పుస్తకము విప్పు?