పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/580

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజన


కలికిగోరులు సిబ్బెంపుగబ్బిగుబ్బ
లలఁతి మోవియు నసదుఁగౌ నలురుమోము
గొనబుచేతులు తెలిగన్ను లొనరుమేను
జేసినెత్తమ్మిచూలి పోఁజేసికొనియె. 117

గీ.ఈడు కలిగించియును బువ్వుబోఁడికీడు
      కలుగకుండఁగ నొనరించె నలువయౌర
      తలఁచిచూచిన నేదియో తమ్మి చూలి
      టక్కుగావింపఁగాఁబోలునిక్కముగను. 118

గీ.నలువతమ్ములఁ గల్వలఁజెలువుమీఱఁ
      జేసి యవి రేయు ఁబవలును జెన్ను లేచి
     వౌటపొడగాంచి యారెంటి నేటఁగలిపి
     కలికికన్నుల ననయంబు వెలుఁగ ఁజేసె. 119

గీ.నేలపైనంటులుంట యేమేలివింత
     యనుచు మదినెంచి వింతసేయఁగఁదలంచి
      నలువ యనఁటులపై నేలకలుగఁజేసె
       నెలఁత తొడలును మొలయున నెపమువెట్టి. 120

ఉ.మించులఁ గెంపుల న్నెలను మేలియనంటులఁగూర్చి నల్వమై
      మించును వాతెఱ న్మొగము మేల్తొడలుం దగఁజేసి వానిలో
      నించినతళ్కును బిగియు నీలియు నాకును దీసిచూపులన్
     బించపుఁ గుబ్బలుం దుఱుము వీ నొసర్పఁగఁబోలునింతికిన్. 121

చ.అలతలకట్టు లింతితఱులన్ను క్స్నుల్నిడుదల్వెలంది చె
      న్నలరెడు బొడ్డునట్రుసుడి వాతుకసై కపుఁగౌనునున్న బం
     తులు ననబోఁడి చన్నుఁగవ దొంతిగవిద్దెలు రూపుపూని యీ
     మెలఁత నెపంబునం బుడమిమీఁదను గ్రుమ్మరుచున్న వారయ౯. 122