పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ ప్రకరణము

   
పురాణకాలక్షేపము-రాజశేరుడుగారి స్థితి-ఆయన దానమఱది
దామోదరయ్య చరిత్రము- మిత్రుడు నారాయణమూర్తి కథ-ఎఱుక
యడుగుట.


రాజశేరుడుగారు భోజనము చేసిన తరువాత ఒక్క నిద్రపోయి లేచి, తాంబూలము వేసికొని కచేరిచావడిలోనికి వచ్చి కూర్చుండిరి.అంతకుమునునే గ్రామమున గల పెద్దమనుష్యులు పలువురు వచ్చి తగినస్థలములలో గూర్చుండి యుండిరి. అప్పుడు రాజశేరుడుగారు 'సుబ్రహ్మణ్యా!'అని పిలిచినతోడనే 'అయ్య 'అని పలికి లోపలి నుండి పదియాఱు సంవత్సరము వయసు గల యెఱ్ఱని చిన్నవాడొకడు వచ్చి యెదురు నిలువబడెను. అతడు రాజశేరుడుగారి జేష్ఠపుత్రుడు; సీత పుట్టిన తరువాత రెండుసంవత్సరములకు మఱియొక పిల్లవాడు కలిగెనుగాని యాచిన్నవాడు పురుటిలోనే సందుగొట్టిపోయెను. ఆ వెనుక మాణిక్యాంబకు కానుపు లేదు. సుబ్రహ్మణ్యము యొక్క మొగ మందమైనదేకాని మూడేండ్లప్రాయమున బాలరోగము వచ్చినప్పుడు పసపుకొమ్ముతో గాల్చిన మచ్చమాత్రము నొసటను గొంచెము వికారముగానుండెను; కన్నులు పెద్దవి; నుదురు మిట్టగా నుండెను; తలవెండ్రుకలు నిడువుగాను నల్లగాను ఉండెను. చేతుల బంగారు మురుగులును చెవులను రవలయంటుజోడును అనామికను పచ్చదాసిన కుందనంపుపని యుంగరమును ఉండెను.

రాజ-సుబ్రహ్మణ్యా! అందఱితో గూడ నీవు మధ్యాహ్నము భోజనమునకు వచ్చినావుకావేమి?</poem>