బోయిరాఁడాయె నిదె చాలప్రొద్దులోయె
నచటఁబోయిన పనియేమొ యడ్డపోలు. 112
గీ.అనుచుఁ దలఁచుచు నవ్వలనరుగుదెంచు
నెచ్చెలిమికాని దవ్వుల నెమ్మిఁగాంచి
యెదురుచని చెప్పునంత కోర్పెదనులేక
చనినపని కాయయో పండొయనుచు నడుగు. 113
గీ.ఏనుబోయనపని గాయయేలయేగును
బనిని పండించుకొనియె నేవచ్చినాఁడ
నిన్ను మున్నట్లు వీడ్కొని నేనుగదలి
తొలుతఁ గారుకోనలు దాఁటి తోటఁజొచ్చి. 114
క.ఎలజవ్వనముం దొలఁకఁగఁ
దొలుకారు మెఱుంగులట్టి తొడవులుగల యా
బలు సింగారంపు నెలం
తలలోపలఁ గూరుచున్న నాతుకఁ గంటి౯. 115
వ.ఆచక్కరబొమ్మ చక్కదనమ్మొక్కించుక వక్కాణించెదఁ జక్కఁగా వినుము.
సీ.బయలరిక్కలచాలు పాఱవై చినయెగ్గు
మలలనెల్లను జట్టుపఱుచునేగి
పవడంబులను మానుపడఁగఁ జేసినకీడు
సింగంబునడవిపాల్సేయురవ్వ
చందురులోఁగందు పొందించునారడి
చిగురులఁగఱకుగాఁ జేయుకొదవ
నెత్తమ్ములను లోఁతునీలువై చినరట్టుఁ
బసిఁడికిఁ దావిఁగూర్పనికొఱంత
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/579
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
