పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసిక జనమనోరంజనము

గీ. మేరయెఱింగిచెప్పి మెప్పింతుననుకొన్న
నెలఱేనియసపుఁబాలవెల్లి
పలుకుఁజెలికిమిగులఁ దలముస్కలయినచో
నొరులుదాని నరయు నోపువారె. 95

గీ. అట్టియెకిమీనికి ననుంగుఁబట్టియీమె
కనులయెదురనె కానిప్ంచు కతనవేఱె
యీమెచెలువంబు పొగడంగ నేలమాకుఁ
బలుకువెలఁదుకు మెప్పునఁగలిగెనీమె 96

ఉ.ఏడును మీఱెరుంగనవి యేవియు లేవటుగాన మీఁదనే
జాడల నెప్పుడెవ్వనిని జవ్వనినెట్టనఁ జెట్టవట్టునో
వెఁడెద నిక్కువబు వినిపింపుఁడు కల్లలుపల్కిరైని నా
తోడుసుఁడీ యటంచు మదితొట్రిలఁబల్కిన నవ్వి యిట్లనున్.::::::::::97

క. మేమరయఁగ మీవారము
కామే మమ్మింత వేఁడఁగా లాఁతులమే
లేమా లెస్సగఁజూచిన
మీమెలఁతుక యుక్కటియును మేమొకటియునే.::::::::::::::::::::::::::98

మ. చెలియా సందియమేలనీపడఁతుకంజేపట్టు వివ్వచ్ఛుఁడి
మ్ములనామాటలు నమ్మియుండు మిటుపైఁబూ బోఁడియుంగ్రీడి తా
మలరుందావియుఁ బోలెనొక్కటయు యెయ్యారంబుగా నుండఁ గ
న్నులనిండం గనువేడ్కయీచెలులకు నొన్నాళ్ళకేకల్గెడున్.::::::::99

క. కన్నుల విల్గలవాఁడిం
కన్నులలో మేలు బంతియగు నీనవలా
కన్నుల తూపులుగావే
గన్నులదొరపట్టి గెలువఁగలవాఁడుసుమి.::::::::::100