Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజనము


వ.అనియడుగుడుం గొండొకవడి చిడుముడిపాటున నెడదందలపోసి
యతం డప్పడంతుల కీట్లని చెప్పందొడంగె.

ఉ.మాదొర యొప్పు జెప్పదరమా మనకవ్వడి యాతడారయం
బై దలివేడ్కమీఱ విను మానిక ముందలదాల్చుదిట్టదా
గాదిలివేటకై యొఱకు కై నిప్పుడునచ్చెగానకే
మాదట వెటవచ్చితిమి యాయనచూడ్కికి విందు సేయుచు.

చ.తడవులనుండియేము ముదితా యతడెచ్చటి కేగుచుండు వెం
బడిబడి వచ్చటచ్చటికి వానయు నెండయు నాకవేడ్కతో
నడుచుచుగొల్చుచున్నకతనం గడుసెయ్యముచూపి నిచ్చలా
తడెయొనగుంజుమీ తనకుదానె మదిన్మముమెచ్చి యన్నియు.

సీ.చెలియరోవిను మేనుజెప్పెదనంతయు
మొదల మాదొతయొకపూంకినెఱప
దనమంకి వెలువడి తద్దయుగోరిక
నందందు గలవాకలరసియరసి
యలతు మ్మెదలపాట లాలించియాలించి
సొలయక వింతలు చూచిచూచి
చెలువంపుగోనలు తిలకించి
కన్నారగొండలు కాంచికాంచి
నెలలుపండెండ్రు పొలుపుగ నేలదిరిగి
తనదుపూనిక నెఱవేర్చి చనదలంచి
వెండియిచ్చోట నొకపూటయుండమదిని
దలపుపుట్టిన నాగి నే డెలమితోడ.

సీ.పరిమాలుమావుల దరిగ్రాలుబావుల
విరిచాలుతావుల వేడ్కనొంది