పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/571

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

గీ.ఁమొక్కినలిచిన జిఱునవ్వు మొలకలెత్త
బెండ్ల్లికూతరవకు మీపు నెలదియనుచు
బుడమి వేలుపుదీవించి పువ్వొకండు
చేతిలోనుంచె గూర్మితో జెలువకవుడు.

ఉ.కన్నుల బిన్నవద్వొలయ గై కొనికన్నులనొత్తి మన్నునన్
గ్రొన్ననయన్నుమిన్న నెఱిగొప్పుననప్పండ నేలవేల్పు గ
న్నన్నలదాల్చి కెందళిరు చందము బొందగజూలు కేల్లవం
దిన్న గమోడ్చిలో దనివితీఱని కూరిరుమేరమీఱగ.

ఉ.మెండగువెక్క డెందమున మీఱగ దమ్ముల కన్నదమ్ములై
దండిగనున్న మీయడుగుదమ్ముల కిమ్ములమొక్కగంటి మీ
యండనుజేరి మిమ్ముగొనియాడగ గంటిని మంటి నేడుగా
పండువుమాకు మాకొదలునాసెను మీదగుకూర్మివేరిమి.

గీ.అనినఱియు నేమియో యపుడడుగదలచి
సిగ్గుచే బల్కజాలత చెలులవంక
జూడగా నామెయుల్లంబు చొప్పెఱింగి
వారిలోపల మణిరేఖ పలికెనిట్లు.

గీ.పెల్లుగాచెడు పే రెండు బెంపుతఱిగి
కుందనమువంటి నెమ్మేను కందిపోవ
నెచ్చటెచ్చటద్రిప్పంగ నిచ్చయిడెనొ
కటికతనమూని మీయల్ల మిటులుమిమ్ము.

క.బడలిక యడగగగొండొక
వడిమీరిచ్చోట నిలిచి పలుకుండొగి మీ
యొడయండెవ్వడొ మీరి
య్యెడకు ంవిచ్చేసియుంట కెయ్యదికతమో.