పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణము


కూరలును చల్లారిపోవుటను జూచి లోపల విస్తళ్ళ ముంద ఱగనిపెట్టుకొనియున్న వారు లేచివచ్చి పలుమాఱు పిలువగాబిలువగా సోమయాజులు రెండుగడియలకు మౌనముచాలించి లేచివచ్చి విస్తరిముందఱ గూరుచుండెను. అప్పు డందఱును పరిషేచనములుచేసి భోజనముచేయ మొదలుపెట్టిరి.


రాజ- రాజమహేంద్రవరమునుండి శుభ లేఖ తీసికొనివచ్చిన నీళ్ళకావడివెంకయ్యజాడ లేదు. ఎక్కడ గూర్చున్నాడు?


వెంక-అయ్యా! అయ్యా! ఇదిగో సోమయాజులు గారి వెనుకమూల విస్తరివద్ద గూరుచున్నాను.


సోమ-ఈపాకము దిన్యముగా నున్నది. దీని ముందఱ నల భీమపాకము లెందుకు?


వెంక- సోమయాజులు గారూ! నిన్న సత్రములో పండిన బీరకాయ యింతరుచిగా లేదు నుండీ!


రాజ-ఏ సత్రము?
వెంక-నిన్న రాజమహేంద్రవరములో నొక కోమటియింట గృహప్రవేశమునకు సంతర్పణ జరగినది. బొల్లి పేరయ్యగాడు వంటచేసివాడు. అక్కడ సోమయాజులుగారును నేనును ఏకపజ్త్కినే కూరుచున్నాము.

ఈ ప్రకారముగా నన్యోన్యసంభాషణములు గావించుకొనుచు భోజనము చేసి యందఱును పడమటిం టి దొడ్డిలో చేతులు కడుకొని తేనుచు బొజ్జలు నిమురుకొనుచు వచ్చి చావడిలో గూర్చుండిరి. సోమయాజులుగారు మొట్టమొదట నాలుగుదినము లుండదలచుకొనియే వచ్చినను, భోజనమయమున జరగిన ప్రసంగమును జరగిన ప్రసంగమును బట్టి నిలువ మనసొప్పక సంభావనను సహిత మడగకయే వెంటనే తాంబూలము బుచ్చుకొని నడచిరి.