పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజనము

గీ.ఇట్లు కొలకువెల్వడివచ్చి యింతులెల్ల
దమ రవణములు వల్వలుదాల్చి పిదప
బువ్వుబోడిని గై సేసి వూలుదుఱిమి
పొసగ మొగమున గస్తురిబొట్టువెట్టి.

గీ.మెల్ల మెల్లనె యపరంజిమేడపొంత
బూవుదోటను గుజ్జుక్రొమ్మావి నీడ
జెన్నుమీఱెడు నెలఱాలతి న్నెమీద
బొలతి గూర్చుండబెట్టి యాపువ్వుబోండ్లు.

క.జాణతనపుమాటల వి
న్నణముచూపి చెలియమదినాటిన కుందం
బోనడచి ప్రొద్దువోవగ
వీణియగొనివచి ముందు పెట్టిన వేడ్కన్.

గీ.తీగెలుబిగించి సుతు కడుదిన్నపఱచి
వూని వీణియను బుజంబుపై నిమోపి
కేలునవరించి సారెల వ్రేలునిలిపి
యెలమిమీఱ జిత్రాంగద యింవువుట్ట.

సీ.క్రొవ్వాడికొనగోళ్ళ గ్రుచ్చితంతులుమీటు
నందంబు మదిజల్లుమనికలంప
మురిపెంబుగాబల్కు ముద్దుటెలుంగున
పొతములుకలిపించి సొగసుగాబలికించు
వింతకుఱాలెల్ల వెసగరంగ
హుయలుగాబాడెడు నొఱపై నపాటకు
జేరువమోడులు చిగురుపట్ట