పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/564

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రసిక జనమనోరంజనము

చ.చెలువలు సొమ్ములు ంవిలువచీరలు నొడ్డున బెట్టిపావడల్
బలుచనుకట్లుగట్టి సరివారలజీరుచు నీరుచొచ్చిరా
పొలతులకిప్పు ముక్కు మొగముంగని యంచలు దేంట్లుజక్కవల్
జళుకున నల్లమబ్బు జిగింపెగ చందురుడంచు దూలగ

సీ.చిలుకలకొల్కుల చేతులునడుగులు
నెఱ్ఱదామరగుంపు నినుమడింప
ముద్దులగుమ్మల మోములుజన్నులు
బొందామరలగుంపు బుట్టజేయ
కలువకంటుల వాలుగన్ను లచెన్నులు
నాలుగన్నుగమినిబ్బడిగజేయ
క్రొవ్విరిబోడుల తీరుల మొత్తంబులు
నాచుతీ వెల పెంపునలువరింప
నెలత లెల్లను గుములుగానీరు చేరి
యింపుదళుకొత్తబెల్లుగా నీ దునపుడు
చెలువుమీఱిన నెత్తమ్మి కొలకువకును
గరమువింతగ గ్రొత్తసింగార మొదవె.

చ.చెలువయొకర్తు కె:జిగురు జిమ్మనగ్రోవి యమర్చి పూవుదే
నెలు చెలిమోముదమ్మిపయి నెమ్మినిజిమ్మిన గేలుదామరల్
తళుకు మొగంబుచేరువకు దారుచుటొప్పగు బూవునీటికిం
దలకకు మేముగల్లనని తమ్ములు బాసట వచ్చు నచ్చున.

గీ.ఒండొరుల కేలుదమ్ముల నొక్క మొగిని
నెమ్మొగంబుల పయినీరుచిమ్ముటొప్పె
దమ్మిపూదేనియను జూపుదుమ్మెదలకు
మించుతమి నోగిరంబుగ బంచునట్లు.