పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>రసికజనమనోరంజనము

మనమిదెచని చిత్రాంగదఁ గనుగొందము సుమ్మియెల్లి కన్నులతనియన్

క.అందాఁక నోర్చుకొమ్మని

   కందువమాటలను  జెల్మికాఁడొకఁడచ్చో
  డెందమునందలి   కుందున్
  డిందింపుచునుండ  నవుడ  నేనును  గడఁకన్ .

క.నీయెద యాతనిపయి నిటు

   లోయింతురొ  తగిలియుంట  యొక్కింతయు  నే
   నాయెడ  నెఱుఁగమిచే  నీ
   చాయలవచ్చితని  నంతెచాలు  నటంచు౯ .

క. నమ్ముమిది నేఁట ఱేపటఁ

    గొమ్మానింవదకిగొంచు  గొబ్బునఱేఁడీ
    యిమ్మునకేతెంచి  నినున్
    నెమ్మింజేపట్టు   నీదునెచ్చెలు  లలరన్ .

గీ.కాన నూఱడియుండుము నేనుబోయి

   యిపుడ  మీతల్లిదండ్రుల  కలమింరొక్కి
   వారసేమంబు   లారసి  వత్తుమరల
   ననుచుదిగ్గున   రాచిల్క  లరిగెఁజదల .

క. చిలుకలటుచన్నపిమ్మటఁ

    జెలికత్తియలంతిపురికిఁ  జెచ్చెరఁజెలువన్
   బిలుచుకొనిపోయి  రూఱడఁ
   బలుఁదెఱఁగుల   దిటవుగరపి   పాయనికూర్మిన్ .

వ. అటుతరువాత నడచినకత చెప్పమని జనమేజయం డడుగుటయు.<poem>