పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/553

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ద్వితీయాశ్వాసము

క. కని వారేమనుకొందురొ

  వినవలెనని  వేడ్కపొడమి వెననాలేమిరాఁ
  కునకుండిగి యొకకొమ్మను
  బనివడి నేఁగూరుచుంటి  బడలికవాయ ్ .

వ. అయ్యెడ నాకవ్వడి వెడవిలుక్స్స్నియలజడిం దెలివిచెడి యిదితగు నిదితగదనియెడి యెఱుకలేక యెదుటఁ గనఁబడు వానినెల్లం దడని యిట్లని పలవింపదొడంగె .

సీ. అలలారయంచ తొయ్యలులార మీరైనఁ

            జిత్రాంగదకు నన్నుఁజెప్పగలరై
  తొగలార మేలిసంపఁగులార మీరై నఁ
            జిత్రాంగదకు నన్నుఁజెప్పగలరై
  పొదలార  గండుతుమ్మెదలారమీరై నఁ
            జిత్రాంగదకు  నన్నుఁజెప్పగలరై
  విరులాన చలువతెమ్మెరలారమీరై నఁ
           జిత్రాంగదకు నన్నుఁజెప్పగలరై
  యెంతవేఁడిన నొకరైన నించుకంత
  పలుకనై నను  నాతోడఁ బలుకరేమి
  యేనుజేసిన  తప్పిద మేదియైనఁ
  గలదె యెల్లరు  నన్నిట్లు చులకసేయ 

గీ.నేమమున నేను బండ్రెండు నెలలబట్టి

  యిన్ని యేళ్ళకుఁజని గ్రుంకులిడినయట్టి
 పున్నెముననై న నాకు  నాపువ్వుబోఁడిఁ
 గాంచుమేలైన నొకసారి గలుగరాదే .

క .అని పెక్కువగలఁదలఁకెడు

  ననుఁగుం జెలికాని లోని  యలజడితగ్గన్.<poem>