పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>రసికజనమనోరంజనము

గీ. రవ్వపెట్టక యఁకనైన రమణమీఱ

   జాలిమెయిఁజిల్క   యేదియో  మేలిపలుకు
   చెవిని  వేయంగ  నుంకించెఁ  జెలియలార
   వినఁగ  నీరమ్మమొక్కెద   వీనులలర.

వ. అనుడు నప్పుడప్పుడంతులెల్ల జప్పుడు సేయక యొప్పుల కుప్పయగు నప్పులుగుచెలువ యొప్పిదంబుగాఁ జెప్పఁబోవు మెప్పుమాటల చొప్పటింప నుల్లంబు లువ్విళ్ళూర నూరకున్న నాచిలుకలకి కలికి పలుకుల నాచెలువల చెవులకుఁ జవులు గొలుపుచు గిలుకుటెలుంగున నిట్లసి చెప్పుందొడంగె .

సీ. అలపూవుఁదోఁటలో బలుకువెండిమున్ను

                               పొలఁతినీరూపు   నేఁబొగడినపుడు
     వలపు  డెందములోనఁ  గలిగియుఁగొండంత
                               యొక్కింతయును   వెలికుబ్బనీక
     యగ్గలంబుగఁదొట్టు  సిగ్గుకతంబున
                               దానినంతయు    మదిలోనెయడఁచి
      కల్లగుట్టొకయింత  కాంపింపఁబైటికి
                               నౌనుగాదనుమాట   యనకయుండె

నువిదరో యంతెకాని వేఱొండుగాదు వినుము వినుపింతుఁ దరువాత వెర్రియగుచు వలవుతలకెక్క నాతఁడు మెలఁగినట్టి నడత చందమించుక తేటపడఁగ నీకు .

ఉ. నిన్నను నల్వవీడుకొని నేనరుదెంచుచుఁగంటిఁద్రోవలోఁ బెన్నకుఁజేరువం గనులవిందుగఁ జెన్నగునొక్కకోనయం దున్నగుడారముం దఱిసియొప్పెడు మామిడి గున్నక్రింద వే గన్నులవేల్పుపట్టి చెలికాఁడొకఁడూఁతగఁ గూరుచుండఁగన్ .