పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/551

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ద్వితీయాశ్వాసము

గీ . వల యీలాగునిండిన యింటిలోనఁ

  గుడిచికూర్చుండి పనిలేని గొడవయొకటి
  పైనివేసుక పొగలెదు పడఁతిమిన్న
  చాలుఁబదివేలువచ్చె నీచలము విడువు.

గీ. తానుబోయిన పిమ్మట దేనితోడ

  నై నఁబనియేమి తెంపునేయంగవలదు
  తలఁపఁజనునమ్మ నీయంతదానికట్టి
  వెడఁగుఁబనులక్కటా యెంతవెఱివీవు.

ఉ. చానరొ పోలుపొం దెఱుఁగఁజాలక యూరక కుందనేల నె

  ద్దీనె ననంగఁగొట్టమున నీవలిగుంజను గట్టుమన్న యే
  మైనను జెప్పఁగాఁదరమె  యాతఁడు  నాఁడటు మాఱకుల్క కే
  మానినదానికింగతము మన్నన  విన్ననుగాక  నాకింక౯.

గీ. అనుడు నాచిలుకలకొల్కి యవలఁ జిలుక

  చెప్పఁబోయెడు  సుద్దిని జివరదనుక
  వినెడువేడ్క  యువ్విళ్ళూర వెచ్చనూర్చి
  యీవలావలి  చెలులతో నిట్టులనియే.

గీ. మదికలంకఁజేసి యిది యనంగాఁదగు

  నిదియనఁదగదనెడి  యెఱుక లేక
  యేమియోపలికితి నింతెకా  కుసురులు
  విడువఁదలఁప నంతవెర్రినమ్మ.

గీ. అకట నవుటాలకూరకే యన్నమాట

  నిజముఁగాఁబట్టి  యివుడింత  నెలఁతలార
  పట్టిపల్లార్చి  నామీఁద వట్టి లేని
  పోని వాదువేయఁగఁ బాడియౌనెమీకు.<poem>