నలఱేసిమోము వెన్నెలఱేనిఁగొనియాడ
నెకల్వకంటి లోనెంచకుండు
నొడయనిపొక్కిలి మడువుటెక్కెన్నవే
జక్కవచంటిలో స్రుక్కకుండు
నట్టిజెగజెట్టిఁ జేపట్టునట్టిమేలు
పొదలు నిమ్ముద్దరాలికి నొదవెనేనిం
బదిలముగఁ బదియార్వన్నె పసిఁడితోడ
మంచి కెంపునుగూర్చిన మాడ్చియనుచు.
క. తలపోసి యతనిఁ గగ్నొని
వెలయన్మముఁ దెల్పికొంచు వెలఁదుకమచ్చోఁ
బలుకుల వెబడిఁ బేర్కొని
చెలువెల్ల నుబొగడి మున్నె చెప్పినదాన౯.
ఉ. అంతియచాలునంచుఁ దఱుచాడక యత్తఱినూరకుండి నా
యంతనుబోయితిం బయబమై సెలవాయనయొద్దఁబొంది ని
ప్నొంతల ల్వవీటికిని ముద్దియ నీమది గొంతిపట్టిపై
నింతగనిల్చియుంట యొక యింతయు నప్పుడు నేనెఱుంగమి౯.
క. అనిమఱీయు వేమొచెప్పఁగఁ
జనుచిలుకం జెప్పనీక సడలినతాల్మిన్
గనుఁగొనల నీరు కాఱఁగ
ననియెం జిత్రాంగద గడు నడలుప్పొంగ౯.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/549
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
