పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజనము

ఉ.పుత్తడిచాయ మోమునకు ముక్కున క ఱ్తికి జెక్కుదోయికి
బొత్తుగవెల్లదమ్మినువుబువ్వూ జిందము నిగ్గుటద్దమున్
గుత్తగబోల్చి కబ్బముల కూర్పరులాడినమాట చెల్లెనా
నిత్తఱి జానమేను తెలుపెక్కెను బువ్విలుకానికాకల

ఉ.అప్పుడు ముద్దురాలివితమారసి నందియు మొంది నెచ్చెలు
మెప్పాదవంగ జేరజని మేకొనియుంచుక పట్టిచూచి కే
ల్నిప్పులమీద బెట్టినటు నెట్టనదోచిన నుల్కుచెంది యా
యెప్పులకుప్పుతోడ జెలులొక్కట నిట్లనిరుమలంబునన్.

సీ.వీనుదోయికిజూల విందు సేయుచువీణె
మెల్లన కొనగోట మీటనేమి
ముద్దుబల్కుల నింపుపుట్టంగ నెప్పుడు
బెంపుడుజిల్కల బిలువవేమి
యఱచేతజప్పుటల్ చఱచి హెచ్చరికతో
నింటి నెమ్మళ్ళవాడింపవేమి
చవితిచందురుదూఱం చక్కనినుదుటపై
దేటకస్తురిబొట్టు దీర్పవేమి
కలికిరాయంచబోదల గారవించి
తీరుగా నెన్నడల్ తగదిద్దవేమి
మేలిమిపసిండి క్రొంజాయమీఱజూలు
మేన నాడెంపు దొడవులుపూనవేమి.

గీ.మగువ నీ తెఱగేమియో మాకుజూడ
వింతగాదోచుచును గడువెఱవు గొలుపు
చున్నదిదె వేడుకొనెదము నిన్ను మేము
చెచ్చెరను నీదుమదివంత చెప్పవమ్మ.