పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజికము

<poem>జనువున మాటలు చెప్పుచుఁ గొనిచనియె విశారదుండు కొండొకయెడకున్.

క.అటునెయ్యెనిఁగొని చమచు౯ దటుకునఁజెలికాండ్రకెల్ల దగువనులెలమి౯ దిటవుగనుజెప్పి వారల నటునిటువడిఁ బంపివేసి యక్కఱదోఁపన్.

వ.ఇంతంతనరాని సంగడికాని వలవంతం దలంచి తల పంకించి మరుని మీఁదఁగినుక వొడమి.

గీ.మూడు కన్నులవానితో మొనసిమున్న చచ్చిబ్రతికియు వలఱేఁడ చలముతోడ వేయికన్నులదేవర బిడ్డమీఁది కేమొగంబునవచ్చితివిపుడుమరల.

గీ.అనుచు మరుదూఱిముందుచేయంగ వలయు కర్జమెదలోనఁ దలపోసి కాంచెయొకటి మదికి సరిపడ్డపిమ్మటఁబొదలువేడ్క సరగఁగ్రీడికిట్లనియె విశారదుండు.

సీ.ఁముచ్చలచేనల్ల పుడమివేలుపునిన్న

            నావునుగోల్పోయి యారటమునఁ

దనయావు విడిపింపుమనుచు నీయొద్దకుఁ

           బరునెత్తుకొనివచ్చి పలుఁదెఱఁగుల

వేఁడిన నాతనివిన్న పంచాలించి

          కనికరంబున మదికరఁగఁబాఱి

విల్లుదెచ్చుటకును వెడలి పరాకున

           నన్నద్రోపదితోడనున్న తఱిని