పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము


తోడనే లోపలి నుండి నలుపదియేండ్లు దాటిన విధవయొకతె విడిచికట్టుకొనిన తడిబట్టచెఱగు నెత్తిమిదినుండి రానిచ్చి మునుగు వేసికొని, పొయిలోనిబూడిద నొపటను బొట్టు పెట్టుకొని వెండి చెంబులజోటితో మడినీళ్ళను దెచ్చి పీటయొద్ద నుంచెను. తరువాత రాజశేఖరుడుగారు స్నానముచేసి, జుట్టు తుడుచుకొని కొనలు ముడివై చుకొని, అప్పు దాఱవేశిమడిబట్టను గట్టుకొని వచ్చి, దేవునరుగు ముందఱనున్న పీటమిద గూరుచుండి యాచమనము చేసి, విభూతిపండు కొంచెము చిదిపి నీళ్ళతో దడిపి చేతి యంగుష్ఠమును కనిష్ఠకయు దప్ప తక్కిన మూడువ్రేళ్ళతోను నొసటను భజములను కంఠమునకు కడుపునను ఱొమ్మునను రేఖలను తీర్చి, భువనేశ్వరము తాళము తీసి విగ్రహములను సాలగ్రామములను పళ్ళెములో నిడిమంత్రములు చదువుచు దేవతార్చనమున కారంభించెను. ఇంతలో తక్కినవా రందఱును స్నానముచేసివచ్చి గోడల పొడుగునను పీటలమిద గూరుచుండిరి.


భోజనమునకు రావలసినవా రందఱును లోపలికి వెళ్ళిన తరువాత మాణిక్యాంబ మడి విడిచి నడిమి తలుపు వేసివచ్చి పడక గదిలో కూరుచుండి తమలపాకులు చుట్టుచుండెను. ఇంతలోవీధి తలుపువద్ద "రాజశేఖరుడుగారూ!" అని పిలుపుమిద పిలుపుగా పొలము కేకలు వలె నిరువది కేకలు వినబడెను,"వచ్చె వచ్చె"నని లోపలినుండి పలుకుచు మాణిక్యాంబ వచ్చులోపలనె, కేకలతో గూడ తలుపు మిద దబదబ గుద్దులు వినబడెను. ఆమె వెళ్ళి తలుపుగడియ తీయునప్పటికి, నుదట దట్టముగా బెట్టినవిభూతి చెమ్మటతో గలిసి చప్పిదౌడలకు వెల్లవేయ జెవుల కుండలములు య్యాలలూగ ముడుతలు పడియున్న ముసలిమొగమును, అంగ