పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/539

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయా శ్వాసము

వెలయు పంచదార పలుకులు నీకబ్బఁ
జేయవలయు నేమొ చెప్పమయ్య.

వ.అనినం గూరిమిచెలికాని నేరువు మాటలచేత నాతండు చిలుకకుం
దనకు నడచిన నుడువులచందంబును దనడెందం జొక్కచక్కెర
బొమ్మపయిండగిలి మక్కువం జిక్కియున్న తెఱంగును నెఱింగెనని
తలపోసి తెంపుచేసి యింక నెయ్యునికడం దన యల్లంబులోని
కోరిక చెప్పక కప్పివుచ్చుట కర్జంబుకాదని యెంచి వెంటవచ్చినవారి
నెల్లర నాయాపనులు చెప్పి సాగనంపి మంతనంబున సంగడికానితో
రాచిలుకలు వచ్చినది మొదలుకొని నేఁటిదనుకం జరిగినడంతయుం
బూసగ్రుచ్చినట్లుగాఁ దెలిపి యిట్లనియె.

ఉ.ఇట్టుగనుండె నాతెలివియెల్ల నిఁ కేమని తిట్టుకొందు నాఁ
డట్టులు ప్రేముడింజిలుక యాచెలిసుద్దులె తెల్పువోఁజెవిం
బెట్టక యూరకుంటి నిటుమించినదానినె త్ర వ్వుకొంచునేఁ
డిట్టులు కమ్మవిల్తు విరియేటులు నాఁటఁగనుంటి నక్కటా:

ఉ. గుట్టునఁజేడె వీడడుగఁగోరిక లీరికలెత్తినోరికిం
దొట్టినయంతఁబంతమున దోసపుసిగ్గొక తడ్డునచ్చినన్
గట్టిగ నోరునొక్కఁ దమిగ