పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

జగములెల్ల నుగెల్చు పొగరుగ్మనిపిరుందు దీవులమిదను దివురదయ్యె దొల్లిద్రోవది పెండ్లిముందల్ల మిను నొక్కయేటన బడనేసియున్ననాటి మగతనంబేమియు నచటమరుసిమీను నెదుటసాగింపలేడయ్యె నిపుడుక్రీడి

క.చాలమునుచిల్కచెప్పగ నాలించిన చెపిరిందు నందవుజూవున్ నేలకుగోలకు దెచ్చెను వాలాయము రేనిమేనుబలుడెందంబున్

గీ.ఎనితీసిన గ్రమ్మర నెప్పటట్ల యూరుచుండెడు బల్ తూపులున్నవాని రెండుమూడమ్ములున్న మరుండె గెలిచె నహహ నలువచెయువుల నేమనగవచ్చు

ఉ.ఆమనిగోయిలల్ చిలుక లామని నేయగ దాళలేకలో దామరకంటి నెన్నుచును దామరలింపగరాని కోర్కితో వేమరు దుంటవిల్లుగొని వేమరుడేయగ నొచ్చికుందు నా లేమనుజూడ కిప్పు డెటు లేమనువాడ నటించు నిచ్చలిన్

గీ.ఏకంతబున ననబోడి నెదనుదలప నేకతంబున ననవిల్తుడేయకుండు నలరువింటన నవ దూపులల్ల దొడికి యలరువింటను నడయాడు నరదమెక్కి,

వ.ఇట్లు చెరకువిలుకడు పరవు కరకుటంపర నెరకులుదూర నోరవ లేక యాకవ్వడి పడంతుక తనకన్నులం గట్టిట్టులయినం దనలోదానిట్లని పలవింపదొడంగె