పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజనము

బెనుమావికొమ్మకుఁ బెద్దతడవులేని
కోయిలపల్కుల కొమరుగలిగె

నింతకెన్నఁడు నిలుకడ నెఱుఁగనట్టి
గాలికిమ్మెయి నెమ్మది చాలఁగలిగెఁ
జెప్పనొప్పునె యామనియొప్పిదంబు
చిలువయెకిమీనికైనను నలువకైన.

సీ. పొంకమగుచుఁజను పూవుగుత్తులనొప్పి
కోయిలపల్కుల కొమరుమిగిలి
ముద్దులుగుల్కెడు మొగలిరేకులమించి
చెలువంపుఁబాపటఁ జెన్నుమీఱీ
వింతవింతలతీఁగె దొంతులసొగనూని
పలుమల్లెమొగ్గల చెలువుదాల్చి
బొట్టుగలకడింది పొలువున నలరారి
మోవిచిగురుల బఠీవిఁ బడసి
యాముటేనుఁగు నడకల నల్లదనరి
కన్నులకుఁ బండువొనరించెఁగాన లచ్చి
యెల్లవారికి సంతస మెదలలోన
వెల్లిగొలిపి యయ్యామని నెల్లతఱిని.

గీ. పురుడులేకుండ నక్కానపువ్వుబోఁడి
యలరు కొమరుఁగనిన వల్కులాలకించి
యీడులేకుండ నత్తఱినెల్లపులుఁగు
గములుఁబిల్లలఁ బెట్టంగఁగడఁగెఁ గడఁక.

చ. కొలఁకులనాడుచుం బొగడగున్నుల డాఁగురుమూఁతలాడుచుం
దొలఁగక చల్లులాడి పువుదుమ్మెగఁ జిమ్ముచుఁ దీవెతూఁగుటు