పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

524

రసికజనమనోరంజనము

   సంతసము పట్టఁజాలక సరగడిగుచు
వంటిమితండ తగునని మిటివిగద
గడియయును మాకూనిచ్చటఁదడయఁదీఱ
దీగివత్తుము మఱచిపోయెదవుసుమ్ము.

క. అనివీడ్కొని రాచిల్కలు
వినుత్రొవన మిఁదికెగసి వెసఁజూవునకున్
గనఁబడక సాగిపోయెను
గనుచుండెడిఱేనిచూడ్కి కళవళపడఁగన్.

వ.అనిన తరువాతికత చెప్పుమని జనమేజయుండడుగుటయు.
మగందివృత్తము.

  పొన్నగున్న నెక్కి గొల్లపువ్వుబోండ్లతోడుతక్
  వన్నెమిఱఁజేతులెత్తి పల్వురొక్క చెల్వునన్
  జెన్నుమిఱమొక్కకున్న ఁజేలలియ్యనందు నాఁ
 డన్నపంతు గెల్చుకొన్న తట్టిదిట్టవేలుపా.

కందము, గోమూత్రికాబంధము.
దరివిసమిడఁజనుకొమ్మం
బొరిగొని తెలివొందు పైఁడిపుట్టమురాయా
పొరిఁగసవొడలను గ్రమ్మం
దెరిపిని జెలినందుఁగూడి దిట్టగురాగా.

గద్యము.

ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్య నిర్వచన
 నైషధమహాకావ్య రచనచాతురీధీరంధర నద్యశోబంధుర కందు
   కూరివంశయఃపారావార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్య
   పుత్ర సుజనవిధేయ వీరేశలింగ నామధేయప్రణీతంబయిన
                        బ్రధమాశ్వాసము.